తెలంగాణ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌లో అగ్నిప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. తాడిచర్లలో ఓ కిరాణ షాపులో మంటలు చెలరేగాయి. దీంతో షాపులోని వాహనం, సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. వాటి విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా మరేదైనా ఉందా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



