తెలంగాణ
Sangareddy: పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కా వడగామ గ్రామ శివారులో ఉన్న శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పత్తి మిల్లులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా పొగలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.



