ఆంధ్ర ప్రదేశ్
Chilakaluripet: అగ్నిప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

Fire Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అగ్నిప్రమాదం జరిగింది. సుభాని నగర్, లాహిరి హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి హరిహర టాయ్స్ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలియజేశారు.