తెలంగాణ
Vikarabad: అగ్నిప్రమాదం.. సోఫా ఫర్నిచర్ రిపేర్ షాపులో చెలరేగిన మంటలు

Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో అగ్నిప్రమాదం జరిగింది. సోఫా ఫర్నిచర్ రిపేర్ షాపులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో.. షాపు మొత్తం కాలిపోయింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చింది. సుమారు రెండు లక్షల వరకు ఆస్థి నష్టం జరిగినట్లు షాప్ ఓనర్ తెలిపారు.