తెలంగాణ
Fire Accident: SBI బ్యాంకులో అగ్నిప్రమాదం

Fire Accident: SBI బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్లో ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతానికి మంటలు భారీగా చెలరేగుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.
సిబ్బంది తాళాలు తెరిచే సమయానికే బ్యాంకులో మంటలు చెలరేగుతున్నట్లు సమాచారం. బ్యాంకు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది.