తెలంగాణ
Hyderabad: పేపర్ ప్లేట్స్ కంపెనీలో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్ బాలానగర్ డ్యూరో డైన్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ ప్లేట్ తయారుచేసే కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బందితో పాటు హైడ్రా సిబ్బంది కలిసి 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఇండస్ట్రీలో మంటలు జరిగాయని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.