ఆంధ్ర ప్రదేశ్
నర్సీపట్నం మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం.. పసుపు గోడౌన్‌లో చెలరేగిన మంటలు

అనకాపల్లి నర్సీపట్నం మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. పసుపు గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు అధికారులు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.