సినిమా

RJ Shekar Basha: బిగ్‌బాస్ ఫేమ్, RJ శేఖర్ బాషాపై FIR నమోదు

RJ Shekar Basha: బిగ్‌బాస్ ఫేమ్, RJ శేఖర్ బాషాపై పోలీసులు FIR నమోదు చేశారు. కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఫిర్యాదుతో.. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72కింద శేఖర్ బాషాపై కేసు నమోదైంది. అయితే ఈ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ గతంలోనూ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసింది.

అయితే ఆ కేసు విచారణ జరుగుతున్న సమ యంలో.. కాల్ రికార్డు లీక్ చేశాడని శ్రష్టి వర్మ ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా శేఖర్ బాషా మొబైల్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు సీజ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. పరువుకు భంగం వాటిల్లేలా కొందరు ప్రసారాలు చేస్తున్నారని కంప్లయింట్ చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఉద్దేశ పూర్వకంగా అండ్ దురుద్దేశంతోనే కాల్ రికార్డు చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button