జాతియం
బిహార్ రాజధాని పాట్నాలో భీకర ఎన్కౌంటర్

Encounter: బిహార్ రాజధాని పాట్నాలో భీకర ఎన్కౌంటర్ జరుగుతుంది. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో చొరబడ్డ నలుగురు దుండగులు పోలీసులకు చిక్కకుండా చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నాలుగు పోలీస్ స్టేషన్ల పొలీసులు సంయుక్తంగా కమెండో ఆపరేష్ చేపట్టారు.
అయితే పోలీసులు ఆపరేష్ చేపడుతుండగా దుండగులు ఎదురు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతమంతా తుపాకీల మోతతో దద్దరిల్లుతుంది. ప్రస్తుతం దుండగులను పట్టుకునేందకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.