అంతర్జాతీయం

Donald Trump: ట్రంప్‌నకు చుక్కెదురు.. జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలను నిలిపివేసిన కోర్టు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్ ఆదేశాలను.. అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు . ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై ట్రంప్ స్పందించారు. న్యాయమూర్తి ఉత్తర్వులపై అప్పీల్‌‌కు వెళ్తామని ట్రంప్‌ వెల్లడించారు.

ఈ నెల 20న యూఎస్‌ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే.. ట్రంప్‌ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. పారిస్‌ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్‌ హిల్‌పై దాడిచేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం ఉన్నాయి.

ఇక ట్రంప్‌ నిర్ణయాలపై డెమెక్రాట్‌ల నేతృత్వంలోని వాషింగ్టన్‌, అరిజోనా, ఇల్లినాయిస్‌‌తోపాటు ఓరేగాన్‌ రాష్ట్రాలు సియాటిల్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్‌ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ జాన్‌ కాఫ్నర్‌.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పు ఇచ్చారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button