సినిమా

ఆకట్టుకుంటున్న ఫౌజీ ఫస్ట్ లుక్!

Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం నుంచి సంచలన అప్డేట్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలు చూద్దాం.

ప్రభాస్ అభిమానులకు పుట్టినరోజు సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో దుమ్మురేపనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన ఫెరోషియస్ లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది. యుద్ధ వీరుడిగా, అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడి స్ఫూర్తితో ప్రభాస్ పాత్రను హైలైట్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు హై ఓల్టేజ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయని చిత్ర బృందం చెబుతోంది. హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button