ఆంధ్ర ప్రదేశ్
దారుణం .. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి కుమారులు అభిరామ్ (10), గౌతమ్ (8) విగతజీవులుగా పడి ఉన్నారు.
స్థానికుల సమాచారంతో ఎస్సై నరేష్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఐదేళ్ల క్రితం భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకోగా పిల్లలతో ఉంటున్న చంటి మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.



