ఆంధ్ర ప్రదేశ్
దారుణం.. 8 నెలల చిన్నారిని చంపేసిన తండ్రి

కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం జరిగింది. నీటి డ్రమ్ములో ముంచి 8 నెలల చిన్నారిని తండ్రి వీరేష్ చంపేశాడు. అంతేకాకుండా భార్య శ్రావణిని కొట్టి చంపేయడానికి ప్రయత్నించాడు. శ్రావణి పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరేష్ గతంలో మొదటి భార్యని చంపేసి జైలుకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది.



