ఆంధ్ర ప్రదేశ్
Anantapur: ప్రేమ వివాహం చేసుకుంటానన్న కుమార్తె.. దారుణంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తండ్రి

Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు పరువుహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వివాహం చేసుకుంటానన్న కూతురిపై తండ్రి రామాంజనేయులు కిరాతకంగా ప్రవర్తించాడు. కూతురి ప్రేమ వ్యవహారంలో తరచూ తండ్రితో గొడవలు జరిగినట్టు సమాచారం.
ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భారతి వాదించడంతో తాడు చేతికిచ్చి కూతురిని ఆత్మహత్య చేసుకోమని ఉసికొల్పాడు. అంతేకాదు కూతురు మృతి చెందాక పెట్రోల్ పోసి నిప్పంటించాడు తండ్రి. అనంతరం పోలీసుల ముందు తండ్రి రామాంజనేయులు లొంగిపోయాడు.