Yanamalakuduru: ఐస్‌క్రీమ్‌లో సెనైడ్ కలిపి తిని.. తండ్రి, కొడుకు మృతి

Yanamalakuduru: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఏడేళ్ల కొడుక్కి విషం ఇచ్చి చంపేశాడు. ఆ తరువాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయిప్రకాశ్ రెడ్డి విజయవాడలోని ఓ ప్రాంతంలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం నిర్వహించే వాడు. కరోనా సమయంలో వ్యాపా రం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు.
భార్య స్థానికంగా మందుల దుకాణంలో పనిచేస్తుంది. భార్య ఇంట్లో లేని సమయంలో తన ఏడేళ్ల కొడుకు తక్షిత్ కు ఐస్ క్రీమ్ లో సైనేడ్ కలిపి ఇచ్చి తాను కూడా తిన్నాడు. వెంటనే వారిద్దరూ అస్వస్థతకు గురై ఇంట్లోనే పడిపోయారు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి, కొడుకు ఇద్దరూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.