ఆంధ్ర ప్రదేశ్
Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Road Accident: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోటేకల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని కోలార్ జిల్లా చిక్కహోసహళికి చెందిన వెంకటేశ్ (76), మీనాక్షి (32), సతీశ్ (34), బనిత్ (5), రుత్విక్ (4)గా పోలీసులు గుర్తించారు. చిక్కహోసహళి ప్రాంతానికి చెందిన ఏడుగురు మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.



