తెలంగాణ
మంచిర్యాల జిల్లాలో రైతులకు తీరని ఎరువుల కష్టాలు

మంచిర్యాల జిల్లాలో రైతులకు ఎరువుల కష్టాలు తీరడం లేదు. నీల్వాయి గ్రామంలోని పీఏసీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. అర్ధరాత్రి 2గంటల నుండి రైతులు యూరియా కోసం క్యూ లైన్‌లో ఎదురు చూస్తున్నారు. రైతులు యూరియా కోసం నిద్రాహరాలు మాని పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుండి క్యూలైన్‌లో ఉన్న ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎరువులను అందించాలని రైతులు డిమాండ్ చేశారు.



