తెలంగాణ
తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నల కష్టాలు

తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్న కానీ వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. యూరియా కోరతతో రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో యూరియా కొరతతో రైతులు భారీగా బారులు తీరారు. పంటలకు అవసరమైన యూరియా ఇవ్వడంలేదని రైతులు మండిపడుతున్నారు. ఒక్క రైతుకు ఒక్కే బస్తా యూరియా ఇవ్వడం ఏంటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. పంటకు సరిపోయే యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.