తెలంగాణ
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తీవ్రంగా నష్టపోయిన రైతులు

మొంథా తుఫాన్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో విధ్వంసం సృష్టించింది. మొంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో పెద్ద మొత్తంలో పంట నష్టం ఏర్పడింది.
హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాల్లో పంట నష్టం సంభవించగా జనగామ జిల్లా 25 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లాలో 16,617 ఎకరాల్లో పంట నీట మునిగి రైతు తీవ్రంగా నష్టపోయారు. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.



