Kriti Sanon: కృతి సనన్ మహేశ్ ఫ్యాన్స్ ఆగ్రహం!

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో ఎత్తు గురించి మాట్లాడుతూ ప్రభాస్, అర్జున్ కపూర్ పేర్లు మాత్రమే చెప్పింది. మహేశ్ బాబు పేరు ప్రస్తావించకపోవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్ అవుతోంది.
తెలుగులో ‘వన్ నేనొక్కడినే’తో ఎంట్రీ ఇచ్చి మహేశ్ బాబు సరసన నటించిన కృతి సనన్.. ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయినట్టు కనిపిస్తోంది. ‘తేరే ఇష్క్ మే’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఎత్తు గురించి అడిగితే “నాకంటే ఎత్తుగా ఉన్న హీరోలు ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రమే” అని చెప్పేసింది.
తన తొలి సినిమా హీరో అయిన మహేశ్ బాబును ప్రస్తావించకపోవడం తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా మహేశ్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. “మహేశ్‌ను అవమానించినట్టు ఉంది” అంటూ ఫ్యాన్స్ భారీ ట్రోలింగ్ మొదలెట్టారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదంపై కృతి సనన్ ఇంతవరకు స్పందించలేదు.



