తెలంగాణ
Nizamabad: నకిలీ నోట్ల కలకలం

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో దొంగ నోట్లు కలకలం రేపాయి. జలాల్పూర్ గ్రామానికి చెందిన చిన్న సాయిలు అనే రైతు క్రాప్ లోన్ కట్టేందుకు కెనార బ్యాంక్‌కు వెళ్లగా 2 లక్షల 8వేల 500 రూపాయిల విలువ చేసే 417 ఐదు వందల రూపాయలను మెషిన్లో వేశాడు క్యాషియర్ రవి. రైతు తెచ్చిన ఆ డబ్బులు నకిలీ నోట్లుగా గుర్తించారు బ్యాంకు అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.



