ఆంధ్ర ప్రదేశ్
నకిలీ మద్యం కేసు.. నిందితుడు కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్

నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారు చేసిన ఇంటి అద్దె అగ్రిమెంట్ కొడాలి శ్రీనివాసరావుపై ఉన్నట్లు గుర్తించారు. రెండు రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు.



