తెలంగాణ
Hyderabad: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ప్రచారం.. క్యూ కట్టిన జనం

Hyderabad: ఆడకావచ్చు.. మగ కావచ్చు.. మనుషులకు జట్టు తెచ్చే అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టు అనేది నిజంగా చెప్పాలంటే ఓ ఎమోషన్. అందుకే ఉన్న జట్టును కాపాడుకోవడానికి జనం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు .హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వకీల్ అనే సెలూన్ వ్యాపారి బట్టతలపై జట్టు మొలిపిస్తానని బాగా ప్రచారం చేసుకున్నాడు.
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ ఫేమ్‌కు కూడా తాను బట్టతలపై జుట్టు మొలిపించానని చెప్పుకొచ్చాడు. ఆ ప్రచార వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. బట్టతలతో బాధపడుతున్న మగాళ్లు పెద్ద ఎత్తున సెలూన్‌కు క్యూ కట్టారు.