News
వివాహేతర సంబంధం.. తీశారు ప్రాణం

వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహారాష్ట్రకు చెందిన విష్ణుకు పెళ్లై, పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లగా ఆమెను కలవడం కోసం విష్ణు వెళ్లాడు.
ఈ క్రమంలోనే విష్ణుని గుర్తించిన ఆ మహిళల కుటుంబసభ్యులు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.



