జాతియం
యానంలో కాలం చెల్లిన బీర్ల విక్రయాలు

పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలోని యానాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. కాలం చెల్లిన బీర్లను విక్రయిస్తుండటంపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ దాడులు చేశారు. ఓ ప్రభుత్వ మద్యం షాపులో కాలం చెల్లిన నాలుగు కేసుల బీర్లను విక్రయించిన్నట్లు గుర్తించిన అధికారులు షాపులో ఎక్స్పైర్ అయి ఉన్న మూడు బీర్ల కేసులను స్వాధీనం చేసుకున్నారు.
పుదుచ్చేరి ప్రభుత్వ దుకాణాల్లోనే ఎక్స్పైరీ డేట్స్ అయిపోయిన మందు అమ్ముతుంటే, ప్రైవేట్ షాపులలో ఇంకా ఎంత మద్యం నిల్వ ఉందో అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



