తెలంగాణ
హైదరాబాద్ శివారులో నకిలీ లిక్కర్ కలకలం

హైదరాబాద్ శివారులో నకిలీ లిక్కర్ కలకలం రేపింది. ఎక్సైజ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ ముఠాను పట్టుకున్నారు. చీప్ లిక్కర్‌తో పాటు నాటు సారాను కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
ప్రముఖ బ్రాండ్ల లేబుల్స్‌ను సేకరించి చీప్ లిక్కర్‌ను ఖరీదైన మద్యం పేరుతో విక్రయిస్తున్నారు. ఈ గ్యాంగ్ పెద్ద ఎత్తున నకిలీ సీసాలు మార్కెట్లోకి పంపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న షాపులకు ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.