ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ సంచలన కామెంట్స్

పరకామణి దొంగతనం, నెయ్యి కల్తీ, శాలువాల కొనుగోలలో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్, రంగులు కలిపి తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు ఇచ్చారని గతంలో చెప్పానన్నారు. భక్తుల కానుకలను కూడా దంగతనం చేశారని ఆరోపించారు మాజీ బోర్డు మెంబర్ రమణ.
అసలు స్వామివారి నగలు నిజమైనవి ఉన్నాయా లేక గిల్టు నగలు అనే అనుమానం భక్తులకు కలుగుతోందన్నారు రమణ. ఇన్ని తప్పులు చేసి సిగ్గులేకుండా పక్కన జోకర్లను పెట్టుకుని ఓ మాజీ ఛైర్మన్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. టీటీడీ చరిత్రలోనే సిట్‌తో కూడిన విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయన్నారు.



