ఆంధ్ర ప్రదేశ్

Roja: రోజా అరెస్టు తప్పదా?

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో అవినీతి రోజా మెడకు చుట్టుకుంది. మంత్రిగా ఉన్న సమయంలో తన శాఖలో జరిగిన అవినీతి కేసులో అరెస్టు తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతుంది.దీంతో వైసిపి ఫైర్ బ్రాండ్ రోజాకి రానున్నది గడ్డు కాలమే అనే వాదన పొలిటికల్ సర్కిల్ లో జోరుగా జరుగుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అవినీతి పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేల పై కేసులు పెడుతుంది. కొందరిని అయితే ఏకంగా జైలు పంపింది ప్రభుత్వం. జగన్ కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసి జైలు కి పంపించింది. పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి జగన్ కేబినెట్ సహచర మంత్రుల పై కేసుల కత్తి వేలాడుతోంది.

వైసిపి సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసు లో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.తాజాగా మరో మాజీమంత్రి రోజా అవినీతి పై ప్రభుత్వం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ,జన సేన నేతలు రోజా నీ టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి చేశారని రోజా అరెస్టు తప్పదు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

జగన్ కేబినెట్ లో రోజా క్రీడా శాఖ మంత్రిగా పని చేశారు. వైసీపీ హయంలో గ్రామీణ స్థాయిలో క్రీడలను,క్రీడా కారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్రా పేరున ఆటల పోటీలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమం పై టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అవినీతి ఆరోపణలు చేసింది. ఆడుదాం ఆంధ్రా పేరుతో అప్పటి మంత్రి రోజా భారీగా అవినీతి కి పాల్పడ్డారని ఆ డబ్బుతో బెంజ్ కార్లు, చెన్నై లో ఆస్తులు కూడా బెట్టారు అనేది ప్రధాన ఆరోపణ.

అయితే ఆ ఆరోపణలు రుజువు చేయాలి అంటూ గతంలోనే రోజా తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతి పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ తాజాగా విచారణను పూర్తి చేసింది. ఆడుదాం-ఆంధ్రా’ లో దాదాపు 40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించిన విజిలెన్స్, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.

వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ఆడుదాం-ఆంధ్రా’కు125 కోట్లు కేటాయించింది. జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ తేల్చింది.రెపో మాపో విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరనుంది.

మాజీ మంత్రి రోజా రాజకీయాల్లో దూకుడుగా ఉంటారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా కూడా ఆమెకి పేరు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఆమె టార్గెట్ మాత్రం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి లోకేష్. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత రోజా కొద్ది కాలం సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ పొలిటికల్ గా రోజా యాక్టివ్ అయ్యారు.

వీలు దొరికినప్పుడల్లా అధికార పార్టీ పై ఫైర్ అవుతున్నారు. 2029 వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ఇప్పుడు ఎగిరి ఎగిరి పడిన వాళ్లను ఎగరేసి కొడతాం అంటూ ఈ మధ్య మాజీమంత్రి రోజా చేసిన హాట్ కామెంట్స్ సంచలనంగా మారాయి.ఇలా రోజా దూకుడు పెంచుతుండటం తో ఆడుదాం ఆంధ్రా అవినీతి తెరపైకి వచ్చింది.

గత ప్రభుత్వం లో మంత్రులుగా అధికారం చెలాయించిన నేతల అవినీతి చిట్టా ఒక్కొకటి ప్రస్తుత ప్రభుత్వం బయటకు తీస్తుంది. దీంతో తాజాగా రోజా మంత్రిగా చేసిన అవినీతి పైనా విచారణ చేపట్టింది. అందులో భాగంగానే విజిలెన్స్ శాఖతో విచారణ చేయించింది. ఈ విచారణో నలబై కోట్ల అవినీతి వ్యవహారం బయట పడటం తో ప్రభుత్వం మాజీమంత్రి రోజా నీ అరెస్టు చేసి అవకాశం ఉంది అనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

అయితే మాజీ మంత్రుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పెడుతున్న కేసుల విషయంలో ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రోజా అవినీతి వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button