ఇథియోపియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇథియోపియాలో 10 వేల ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలీ గబ్బీ వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కేరళ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. బూడిద రేణువులు నార్త్ ఇండియా వైపు వస్తుండటంతో మరికొన్ని ఎయిర్ లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బీ అగ్నిపర్వతం ప్రభావం భారత్‌పై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130km వేగంతో ఎర్రసముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్‌లో కనిపించింది. 25వేలు-45 వేల అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హరియాణా, గుజరాత్, పంజాబ్, యూపీ, హిమచల్ ప్రదేశ్‌కీ వ్యాపించే ఛాన్స్ ఉందని అధికారులు అంచన వేస్తున్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడుతోంది.



