తెలంగాణ
రైల్వేమంత్రి అశ్వనీవైష్ణవ్‌తో ఈటల రాజేందర్ భేటీ

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అనుమతులు, నిర్మాణాలపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఈటల విజ్ఞప్తి చేశారు.
ఆదివాసీల పండుగ మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రైల్వే లైన్ నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రి అశ్వనీని ఈటల రాజేందర్ కోరారు. వైద్యపరంగా, ఇతర కారణాలతో మరణించిన రైల్వే కార్మికుల కుటుంబాలకు ఊరట కలిగించే విధంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు.