ఆంధ్ర ప్రదేశ్
మన్యం జిల్లా పెదమేరంగిలో గజరాజుల బీభత్సం

మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. స్థానిక మినీ మోడ్రన్ రైస్‌మిల్‌లోకి చొరబడి హల్‌చల్ చేశాయి. అంతేకాదు పండ్ల దుకా ణాన్ని కూడా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఏక్షణాన ఇండ్లపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిపార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ సిబ్బంది స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.