తెలంగాణ
కాళేశ్వరంలో వృద్ధుడి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఓ వృద్ధుడు ఆత్మార్పణం చేసుకున్నాడు. అంతర్రాష్ట్ర వంతెన వద్ద బ్రిడ్జ్ మీద నుండి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేముందు ఓ బాబా ఫొటోకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టాడు. ఆత్మహత్య చేసుకునే ముందు బ్రిడ్జిపై చెప్పులు విడిచి గోదావరిలోకి దూకాడు.
మహదేవపూర్‌కి చెందిన మండిగా బాపు అనే 70 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందురోజు కుటుంబంలో జరిగిన గొడవ వల్లే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.



