తెలంగాణ
Eatala Rajendar: కూల్చివేతలు జరిగిన ప్రాంతాల్లో ఎంపీ ఈటల పర్యటన

Eatala Rajendar: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు జరిగిన ప్రాంతాల్లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. కూలిపనులు చేసుకునే పేదల ఇళ్లను కూల్చడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయన్నారు.
నాయకులే కబ్జాచేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో కోట్లు కొల్లగొడుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డునపడ్డ బాధితులకు న్యాయం చేయాలని ఈటల డిమాండ్ చేశారు.



