తెలంగాణ
Eatala Rajendar: 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుంటే రేవంత్ భరతం పడుతాం

Eatala Rajendar: బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీసీలకు బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదని, అలాగే బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ సీఎం సీటు ఇచ్చే ఛాన్సే లేదని ఈటల విమర్శించారు.
రిజర్వేషన్లపై సీలింగ్ అనేది అడ్డంకే కాదని సాధించుకునేందుకు రేవంత్ అనుసరిస్తున్న విధానమే నష్టం కలిగిస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి భరతం పడుతామని ఇందిరాపార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాలో బీజేపీ నేతలు హెచ్చరించారు.