అనుమతి లేకుండా మద్యం పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు మరోసారి వివాదంలో ఇరుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ది పెండెంట్ ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు. అక్కడ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మాధురి కూడా పాల్గొన్నారు.
మాధురి పుట్టినరోజు కూడా శుక్రవారం రావడంతో, పార్థసారథి పేరుతో ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్లు సమాచారం. మొత్తం 29 మంది పార్టీకి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ ఏర్పాటు చేసినందుకు, పోలీసులు 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్కా సెట్లు మరియు మరికొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.



