Dussehra: డ్రగ్స్ కేసులో దసరా విలన్

Dussehra: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఈ నటుడు వివాదాలతోనూ సినీ ప్రియులను షాక్‌కు గురిచేస్తున్నాడు.
తాజాగా ఓ హోటల్‌లో డ్రగ్స్ దందా జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్లు సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఓ మలయాళ నటి షైన్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆయన పేరు తెరపైకి రావడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది.
ఈ కేసులో షైన్‌కు ఎంతవరకు సంబంధం ఉందన్నది పోలీసు విచారణలో తేలనుంది. తెలుగు ప్రేక్షకులకు ‘దసరా’ సినిమాలో విలన్‌గా మెప్పించిన షైన్ ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశమయ్యాడు. మరి, ఈ కేసులో షైన్ నిర్దోషిత్వం నిరూపించుకుంటాడా? లేక మరిన్ని ట్విస్ట్‌లు బయటపడతాయా? వేచి చూడాలి.