తెలంగాణ
నంద్యాల జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో దసరా ఉత్సవాలు

నంద్యాల జిల్లా మహానందీశ్వర దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు మయూర వాహనంపై శైలపుత్రీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దేవస్థాన అలయంలో ఘనంగా సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు.
అనంతరం ఆలయ మాడ వీధుల్లో శ్రీ కామేశ్వరి అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన సంస్కృతి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.



