Ayyannapatrudu: వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన

Ayyannapatrudu: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. 24 జూన్ 2024లో జగన్ తనకు ఓ లేఖ రాసినట్లు సభలో ప్రకటించారు. అయితే ఆ లేఖలో అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులు చేసినట్లు సభ్యులకు వివరించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా అర్హత ఉందంటూ జగన్ అసంబద్ధ వాదన చేస్తున్నారని స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇదే అంశంపై కొద్దిరోజుల తర్వాత జగన్ హైకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. అందులో ప్రతిపక్ష హోదా కల్పించాలని అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని పిటిషన్ వేసిన ట్లు తెలిపారు.
ఇక ఈ పిటిషన్ విచారణకు అర్హత పొందే దశలోనే ఉందన్నారు అయ్యన్నపాత్రుడు. విచారణ ప్రారంభం కాకముందే స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించినట్లు జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాని అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు. తప్పుడు ప్రచారంపై రూలింగ్ ఇస్తున్నానని ప్రకటించిన అయ్యన్నపాత్రుడు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం స్పీకర్‌కే ఉంటుందని ప్రకటించారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమించి తాను వదిలేస్తున్నట్లు చెప్పారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.



