ఆంధ్ర ప్రదేశ్
Kakinada: అర్ధరాత్రి మందుబాబుల వీరంగం

Kakinada: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. పెద్దపూడి గ్రామంలో మద్యం మత్తులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయాలైన వ్యక్తికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మళ్లీ యువకుడు దాడికి యత్నించాడు. దీంతో ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.