తెలంగాణ
మద్యం మత్తులో వ్యక్తిపై గొడ్డలితో దాడి

మద్యం మత్తులో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేల్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామానికి చెందిన రంజిత్ అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన నర్సింలు, బాలయ్య గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రంజిత్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



