తెలంగాణ
Hyderabad: ఆలివ్ బ్రిస్టో పబ్ లో డ్రగ్స్ కలకలం.. 20 మందికి డ్రగ్స్ పరీక్షలు

Hyderabad: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-45లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆలీవ్ బిస్త్రో పబ్లో పార్టీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసినట్లు చెప్పారు. పార్టీలో పాల్గొన్న 20 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు.



