తెలంగాణ
Khammam: మద్యం మత్తులో యువకుల హల్‌చల్

Khammam: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఆర్చ్ వద్ద మద్యం మత్తులో యువకుల హల్‌చల్ చేశారు. అర్థరాత్రి నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. గతంలో జరిగిన ఓ వివాదం విషయంలో జేఎన్టీయూ విద్యార్థిని తెల్దారుపల్లి స్టేజి వద్దకు పిలిచి విద్యార్థిని చితకబాదింది గ్యాంగ్. దీంతో విద్యార్థి తన స్నేహితులకు విషయం తెలపగా విద్యార్థి గ్యాంగ్ అక్కడికి చేరుకుని వారితో వాగ్వివాదానికి దిగారు.
రహదారిపై కర్రలు, బీరు బాటిల్లతో భయానక వాతావరణం సృష్టించారు. గొడవ పడుతున్న వారిని స్థానికులు ప్రశ్నించగా వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.



