తెలంగాణ
హైదరాబాద్‌లోని కోఠి ENT హాస్పిటల్ జలదిగ్బంధం

హైదరాబాద్‌లోని కోఠి ENT హాస్పిటల్ జలదిగ్బంధమైంది. హాస్పిటల్ ఆవరణతో పాటు వార్డులు, ఎమర్జెన్సీ సెంటర్‌లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్లు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల కింద ఆస్పత్రికి చెందిన నాలా పైకప్పు కుంగింది.
అప్పటినుంచి ఆసుపత్రిలోకి వరదనీరు వస్తుంది. అయినా అధికారులు మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో మరోసారి ఆసుపత్రి లోపలికి భారీగా వర్షపునీరు వచ్చి చేరింది.



