Stock Market: భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ట్ ఎనలిస్ట్‌లు. ప్రస్తుతం 5శాతం మేర భారత స్టాక్ మార్కెట్లు నష్టపోయినట్లు తెలుస్తుంది. 3వేల 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్ ఐటీ, ఫార్మా సహా మౌలికరంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి.
ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7శాతానికి పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. గిఫ్ట్-నిఫ్టీ 900 పాయింట్ల పతనం అయ్యాయి. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్‌స్ట్రీట్‌లోనూ నష్టాల పరంపర కొనసాగుతోంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తెల్చిచెప్పారు. అంతే కాదు కొన్ని సార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.