అంతర్జాతీయం

Donald Trump: మోడీ నాకు మంచి మిత్రుడు.. త్వరలో భారత పర్యటనకు వస్తా

Donald Trump: భారత ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి, తనకు మంచి మిత్రుడని కొనియాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. భారత్​ పర్యటనపైనా ట్రంప్​ హింట్​ ఇచ్చారు. 2026లో ఇండియాకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాది తాను భారత్‌ను సందర్శించే అవకాశం ఉందన్నారు. బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రధాని మోడీతో తన చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్నారు.

భారత ప్రధాని మోడీ రష్యా నుంచి కొనుగోలును చాలా వరకు తగ్గించారన్నారు. మోడీ తనకు మిత్రుడన్న ట్రంప్ తాము మాట్లాడుకుంటూ ఉంటామని వెల్లడించారు. మోడీ తనను భారత్‌కు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అన్న ట్రంప్ తప్పకుండా భారత్‌కు వెళతానని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది భారత్ పర్యటన ఉంటుందని హింట్ ఇచ్చారు.

రష్యా నుంచి చమురు కొంటోందంటూ భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. ఈ నేపథ్యంలోనే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button