అంతర్జాతీయం

Donald Trump: జో బైడెన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురిపై డొనాల్డ్‌ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈస్టర్‌ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన బైడెన్‌ సహా పలువురు న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులను లక్ష్యంగా చేసుకొని ధ్వజమెత్తారు. వారి చర్యల వల్లే దేశంలో అక్రమ వలసదారులు పెరిగారని దుయ్యబట్టారు.

ఓపెన్‌ బార్డర్స్‌ పాలసీ ద్వారా సరైన విధంగా తనిఖీలు చేయకుండానే లక్షలాది మంది నేరస్థులను దేశంలోకి అనుమతించారని మండిపడ్డారు. ఇప్పటివరకు పనిచేసిన అధ్యక్షుల్లో అత్యంత అసమర్థుడు బైడెన్‌ అని పేర్కొన్న ట్రంప్‌ గతంలో ఆయనేం చేశారో ఆయనకే తెలియదన్నారు. గత ఎన్నికల సమయంలో తనను మోసం చేసిన వారికీ ఈస్టర్‌ శుభాకాంక్షలు అంటూ ట్రంప్‌ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button