ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోళ్లు ఆపేంతవరకు న్యూఢిల్లీ భారీ టారిఫ్‌లు చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్రమోడీ నాతో స్వయంగా చెప్పారని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది. దీంతో ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే వారు భారీస్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారని అన్నారు. కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నానని ట్రంప్ అన్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మోదీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తానని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందించింది. ట్రంప్-మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు.



