అంతర్జాతీయం

Donald Trump: పుతిన్‌కు పిచ్చి పట్టింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక మలుపు వచ్చింది. రష్యా ఇటీవల జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ను పిచ్చివాడుగా అభివర్ణించాడు. ఉక్రెయిన్ నగరాల్లోకి క్షిపణులు, డ్రోన్లు పంపి ప్రజలను చంపుతున్నాడని మండిపడ్డారు. తాను అధికారంలో ఉండి ఉంటే ఇలాంటి యుద్ధమే జరిగేది కాదన్నాడు. పుతిన్ ఉక్రెయిన్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడమే రష్యా పతనానికి కారణమవుతుందని ట్రంప్ హెచ్చరించాడు.

గతంలో పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు అతనిలో ఏదో మారిపోయిందని ధ్వజమెత్తాడు ట్రంప్. పుతిన్ చాలా మందిని చంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పట్ల కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మాట్లాడే ప్రతి మాట సమస్యలకే దారితీస్తోందని దుయ్యబట్టాడు. ఇటీవల ట్రంప్- పుతిన్ రెండు గంటలపాటు ఫోన్ సంభాషణ జరిగింది.

శాంతి చర్చల కోసం పుతిన్ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, ఓ అవగాహనకు రావాలని ట్రంప్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో, రష్యాపై మరింత ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ యుద్ధాన్ని ఆపాలంటే, రష్యాపై బలమైన ఒత్తిడి అవసరమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ట్రంప్‌కు తేల్చి చెప్పాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button