అంతర్జాతీయం
US-China: చైనాకు ట్రంప్ మరో షాక్.. టారిఫ్‌లు 104%కి పెంపు

Donald Trump: అధిక సుంకాలతో ప్రపంచాన్ని దడదడలాడిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరో గట్టి షాకిచ్చారు. బీజింగ్ నుంచి వచ్చే దిగుమతులపై ఏకంగా 104శాతం టారిఫ్‌లు ప్రకటించారు. దీంతో ప్రపంచ మార్కెట్లు మరోసారి కుదేలవుతున్నాయి.
ఇప్పటికే అమెరికా మార్కెట్లు నష్టాలను చవిచూడగా ఇవాళ కూడా ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమవు తున్నాయి. అటు చైనాపై పెంచిన సుంకాలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. వాస్తవానికి వారం వ్యవధిలోనే 10శాతం నుంచి 104 శాతానికి చేరాయి అమెరికా సుంకాలు.