అంతర్జాతీయం

Donald Trump: బీబీసీకి ట్రంప్ షాక్.. బిలియన్ డాలర్లు డిమాండ్!

Donald Trump: ఆయనేం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఒకసారి వద్దంటాడు. మరోసారి కావాలంటాడు. వద్దన్నది కావాలనడం, కావాలన్నది వద్దనడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఒకసారి ప్రపంచ దేశాలను అలా చేస్తా, ఇలా చేస్తానంటాడు. మరోసారి ప్రపంచమంతా వసుధైక కుటుంబమంటాడు. ఇలా నోటికి వచ్చిందల్లా మాట్లాడే ట్రంప్ తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు. నాడు అమెరికా బోను ముందు నిలబడని విషయాన్ని మర్చిపోతున్నాడు.

ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో గెలవకుంటే తన పరిస్థితెలా ఉండేదో కూడా తెలిసిందే. ఇటీవల ఆయన తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడం, ఆ తర్వాత వాటి నుంచి వెనక్కి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. ముందు బౌబౌ అంటాడు. తర్వాత బేర్ అంటాడు. అయితే తాజాగా బీబీసీకి షాక్ ఇచ్చాడు ట్రంప్.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి కారణమయ్యాడు. తన ప్రసంగాన్ని వక్రీకరించారని ఆరోపిస్తూ, బీబీసీపై బిలియన్ డాలర్ల పరిహారం డిమాండ్ చేశాడు. 2021లో క్యాపిటల్ హిల్ దాడి సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఎడిట్ చేసి తప్పుగా చూపిందని ఆయన న్యాయవాదులు లేఖ పంపాడు. డాక్యుమెంటరీని వెంటనే ఉపసంహరించుకోవాలని, శుక్రవారం వరకు గడువు ఇచ్చాడు. ఈ ఆరోపణలతో బీబీసీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. తప్పుడు ప్రసారం పై ఇప్పటికే క్షమాపణలు చెప్పినా, ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఆంక్షలంటూ నోటికి వచ్చినట్టుగా మాట్లాడే ట్రంప్.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమన్నది రివాజుగా మారింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమనుకోవాలి. అమెరికా అభివృద్ధికి అంతర్జాతీయ విద్యార్థులు, నైపుణ్య ఉద్యోగులు కీలకమని చెప్పారు. అమెరికా యూనివర్సిటీలకు ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు రావాలన్న ట్రంప్ అదే తమ ఆర్థిక వ్యవస్థకూ, వ్యాపార రంగానికీ అవసరమన్నాడు.

ప్రతిభావంతులపై ఆంక్షలు విధించబోనన్నాడు. ఇదే సందర్భంలో, అమెరికా వాణిజ్య వ్యవస్థను నిలబెట్టే నిపుణుల కోసం H1B వీసాలు కీలకమని, వాటిపై భవిష్యత్తులో సడలింపులు ఇవ్వవచ్చని సూచించారు. తన పాలనలో ఆంక్షలతో కఠినంగా కనిపించిన ట్రంప్, ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సాఫ్ట్ టోన్ అవలంబించడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button